Healthhealth tips in teluguKitchen

1 గ్లాసు తాగితే చాలు ఎంత బరువు ఉన్నా సరే కొవ్వు కరిగి నాజూగ్గా మారతారు

Bay Leaf Weight Loss Tips In telugu : ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేదిస్తున్న సమస్యలలో అధిక బరువు సమస్య మొదటి స్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదేమో…అంతలా వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
Bay Leaf diabetes In Telugu
బరువు తగ్గించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పెద్ద ఆకు అయితే ఒకటి తీసుకోవాలి. చిన్న ఆకు అయితే రెండు తీసుకోవాలి. బిర్యానీ ఆకులో ఉండే లక్షణాలు శరీరంలో పెరుకుపోయిన విషాలను బయటకు పంపడమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది
jeelakarra Health Benefits in telugu
ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి. దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత అరస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చివరగా రెండు యాలకులను వేసుకొని 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి.

ఈ నీటిలో కావాలంటే నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు… లేదా నిమ్మరసం… తేనె లేకుండా కూడా తాగవచ్చు. ఈ డ్రింక్ ని రోజులో ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.