MoviesTollywood news in telugu

త్రివిక్రమ్ సినిమా “అఆ” సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Kalpika Ganesh Unknown Facts : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలోనూ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ మరియు విక్టరీ వెంకటేష్ లు నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సీతమ్మ వాదికిట్లో సిరిమల్లె చెట్టు” వంటి సినిమాలలో కాసేపు కనిపించినా తన నటనతో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పికా గణేష్.

వీటితో పాటు పలు చిత్రాల్లో కనిపించి మంచి నటనను కనబరిచిన ఈమె సోషల్ మీడియా ద్వారా జరిపిన ఓ ఇంట్రాక్షన్ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలా తాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన “అఆ” లో కూడా ఆఫర్ వచ్చింది అని..

తనని నితిన్ కు చెల్లెలి పాత్రలో చేయమని ఆఫర్ రాగా అపుడు వేరే సినిమాలు చేస్తుండడం మూలాన అది వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే మన టాలీవుడ్ లో మరో ఫీల్ గుడ్ మూవీ “కేరాఫ్ కంచరపాలెం”లో కూడా ఓ మంచి రోల్ కూడా వచ్చిందని కానీ అది కూడా వేరే ఆఫర్స్ వలన వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది.