Beauty Tips

వారంలో 2 సార్లు జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగటమే కాకుండా తెల్లజుట్టు సమస్య ఉండదు

Onion Hair Fall Home Remedies In telugu : మనలో చాలా మంది జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకుంటారు. కానీ మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్య ఎక్కువ అయింది. వయస్సుతో సంబందం లేకుండా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.

దాంతో చాలా కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఒక చిన్న ఉల్లిపాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
garlic Health benefits
ఆ తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి పక్కన పెట్టాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 4 మందార ఆకులు, గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక కప్పు నీటిని వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
Hibiscus leaf
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది. నిస్తేజంగా మారిన జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. ఈ రెమిడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రీడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు కి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.
Curry Leaves Health benefits In telugu
మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వలన వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలతో ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కాను పాటించి జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.