ఈ ఫ్రూట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా… లేదంటే ఎన్నో ప్రయోజనాలను మిస్ అయినట్టే
Star Fruit Health Benefits In telugu : స్టార్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు చాలా విరివిగా అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది. స్టార్ ఫ్రూట్ అనేది పసుపు, ఆకుపచ్చ మిళితమైన రంగులో ఉంటుంది. ఈ ఫ్రూట్ ని చాలా మంది తినటానికి ఆసక్తి చూపరు. వీటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా తింటారు.
ఈ పండును అడ్డంగా ముక్కలుగా కోస్తే వాటి ఆకారం స్టార్స్‌లా ఉంటుంది. అందుకే వీటిని ‘స్టార్ ఫ్రూట్స్’ అంటారు. దీనిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌తో పోరాడే శక్తి రోగనిరోధక వ్యవస్థకు వస్తుంది. స్టార్ ఫ్రూట్ లో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు కూడా స్టార్ ఫ్రూట్ ని తినవచ్చు. ఎందుకంటే స్టార్ ఫ్రూట్ లో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గించటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో మెగ్నిషియం సమృద్దిగా ఉండుట వలన నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తింటే సరిపోతుంది.
ఈ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఇందులో ఉన్న కాల్షియం రక్తనాళాలు మరియు ధమనులపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
స్టార్ ఫ్రూట్‌లో హానికర సూక్ష్మజీవులను తట్టుకునే యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్‌లో ఉన్న ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, సపోనిన్లు, స్టెరాయిడ్స్, ఫైటో కెమికల్స్ వల్లే దీనికి యాంటీ బ్యాక్టిరియిల్ లక్షణాలు వచ్చాయి. పండిన స్టార్ ఫ్రూట్ తో పోలిస్తే, ఆకుపచ్చగా ఉన్న పండులోనే అధికగా నిరోధక శక్తి ఉంటుంది. రోజుకి ఒక పండు తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.