హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న దర్శకులు ఎవరో చూడండి
Top 10 directors remuneration : ఒకప్పుడు టాలీవుడ్ హీరోల పారితోషికాలు కోట్లలో ఉండేవి. హీరోలతో పోలిస్తే దర్శకులకు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొంత మంది దర్శకులు హీరోలను మించి పారితోషికం తీసుకుంటున్నారు. అలా సినిమాకి పారితోషికం తీసుకుంటూనే లాభాలలో వాటాలు కూడా తీసుకుంటున్నారు. వారి గురించి తెలుసుకుందాం.
మొదటగా రాజమౌళి గురించి మాట్లాడితే… ఒక్కో సినిమాకి దాదాపుగా 120 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ… లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ అయితే ఒక్కో సినిమాకి దాదాపుగా 80 నుంచి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ… లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నాడు.
దర్శకుడు రోహిత్ శెట్టి 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ ఒక్కో సినిమాకి దాదాపుగా
40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ… లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నాడు. ఏ ఆర్ మురుగదాస్ అయితే ఒక్కో సినిమాకి దాదాపుగా 30 కోట్లు తీసుకుంటున్నాడు.
ఇక శంకర్ విషయానికి వస్తే… ఒక్కో సినిమాకి 30 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే 25 నుంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ… లాభాలలో వాటా తీసుకుంటున్నాడు. పుష్ప హిట్ తో మంచి జోష్ తో పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న సుకుమార్ సినిమాకి 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
అట్లీ ప్రస్తుతం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే కొరటాల శివ కూడా కూడా దాదాపుగా 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. చూశారుగా డైరెక్టర్స్ పారితోషికాలు ఏ రేంజ్ లో ఉన్నాయో… ఈ వివరాలు ఒక అంచనా మాత్రమే.