ఉదయం సమయంలో పెరుగులో ఈ పొడి కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Flax Seeds and Curd Health benefits In telugu : ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్నా…లేదంటే వచ్చిన సమస్యలు తగ్గాలన్నా పెరుగులో ఆవిసే గింజల పొడి కలిపి తింటే సరిపోతుంది. పెరుగు,ఆవిసే గింజలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆవిసే గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక కప్పు పెరుగులో అర స్పూన్ ఆవిసే గింజల పొడి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకోవచ్చు.
వీటిలో ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉండుట వలన గుండె జబ్బులు, రక్తపోటు నియంత్రణ మరియు కొలెస్ట్రాల్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు మరియు రోగనిరోధక వ్యవస్థను సరిగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో ఎటువంటి ఫైబర్ ఉండదు.
అవిసె గింజలలో మ్యూసిలేజ్ అని పిలువబడే కరిగే ఫైబర్‌తో పాటు కరగని ఫైబర్ కూడా ఉంటుంది. అందువలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేయటంతో తినాలనే కోరిక తగ్గి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. .
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు అనేవి ఈ చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.