Beauty TipsHealth

వారంలో 2 సార్లు…ఊడిన జుట్టు దగ్గర 20 కొత్త వెంట్రుకలు వచ్చి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

Hair Loss Home Remedies In Telugu : ఈ చలికాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు చాలామంది భయపడతారు. .

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. .
lemon benefits
సహజమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెమిడీ కోసం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీటిని పోసి ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా మరిగించాలి.
hair fall tips in telugu
ఈ నీటిని చల్లారబెట్టాలి. ఆ తర్వాత అర చెక్క నిమ్మరసం,మనం రెగ్యులర్ గా వాడే షాంపూ కలపాలి. ఈ నీటిని తలకు బాగా పట్టించి రుద్దాలి. అప్పుడు తలలో ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోవటమే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఉసిరిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఈ రెమిడీ ఫాలో అయితే చుండ్రు వంటి అన్నీ రకాల జుట్టుకి సంబందించిన సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.