ఈ టీ తాగితే ఎన్నో ఊహించని ప్రయోజనాలు.. ముఖ్యంగా ఆ బాధలకు చెక్…
Rose Masala Chai benefits In telugu : ఈ చలి కాలంలో వేడివేడిగా టీ తాగితే చాలా హాయిగా ఉంటుంది. అయితే నార్మల్ టీ కాకుండా Rose Masala Tea తాగితే రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిని వారంలో రెండు లేదా మూడుసార్లు తాగితే సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ టీ పొడి, రెండు స్పూన్ల ఎండిన గులాబీ రేకులు, అర స్పూన్ తులసిపొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకులను చితకొట్టి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ టీవీ వడగట్టి రుచికి సరిపడా తేనె కలిపి వేడివేడిగా తాగితే జలుబు., దగ్గు, గొంతు నొప్పి వంటివన్నీ మాయమవుతాయి.
ఈ టీలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లోనూ యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన సీజన్లో వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించటానికి రోజ్ మసాలా చాయ్ చాలా బాగా సహాయపడుతుంది. .
జీర్ణ ప్రక్రియ బాగా సాగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గటానికి కూడా సహాయ పడుతుంది. అలాగే వీటిలో వాడిన యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అధిక రక్తపోటుకు కారణమైన స్త్రీ రాడికల్స్ ని నియంత్రిస్తుంది.
అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది. డ్రై గులాబీ రేకలు మనకు ఆన్లైన్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. ఇంటిలో తాజా గులాబీ రేకులు ఉంటే వాటిని కూడా ఉపయోగించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.