అర స్పూన్ గింజలను తింటే శరీరంలో 100 రోగాలు ఉన్నా సరే అన్ని మాయం అవుతాయి
Fenugreek seeds Health Benefits In Telugu : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్న ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ఈ రోజుల్లో మారిన జీవన శైలి, కల్తీ ఆహారం తీసుకోవటం వంటి కారణాలతో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.
ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టాలంటే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. డయాబెటిస్ వచ్చిన బిపి వచ్చిన జీవితకాలం మందులు వాడాల్సిందే. గ్యాస్ సమస్య వచ్చినా కిడ్నీ సమస్యలు వచ్చినా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఇలా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మందులు వాడాల్సిందే.ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో మల బద్ధకం ఒకటి.
ఇటువంటి సమస్యలు అన్నింటికీ మంచి పరిష్కారం ఉంది. ఆయుర్వేదంలో మెంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మెంతులు మన వంటగది పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గ్యాస్., అల్సర్, మలబద్ధకం, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధిక బరువు సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోజు రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే… మెంతులను దోరగా వేగించి మెత్తని పౌడర్ గా చేసుకుని నిల్వచేసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగవచ్చు. ఈ విధంగా మెంతులను తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త సరఫరా బాగా జరుగుతుంది గుండెకు సంబంధించిన సమస్యలు రావు కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి.కాబట్టి మెంతుల్లో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిసింది కదా .. మీరు కూడా వాడి ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.