Mahesh Babu “ఒక్కడు” సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
Mahesh babu okkadu movie photos : సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలివుడ్ కి పరిచయం అయినా మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రంగా నిలిచి మహేష్‌ను సూపర్ స్టార్ మహేష్‌బాబుగా మార్చిన చిత్రం ఒక్కడు.
ఆ సినిమాలో నటించే అవకాశం మొదట గోపీచంద్‌కు వచ్చిందట. హీరోగా కాదులేండి, ఓబుల్ రెడ్డి పాత్రలో గోపీచంద్‌ను తీసుకోవాలనుకున్నారట. అయితే అప్పటికే నిజం చిత్రంలో విలన్‌గా గోపీచంద్ చేస్తున్న కారణంగా ఒకేసారి మహేష్‌బాబుతో రెండు సినిమాల్లో విలన్‌గా చేయడం బాగుండదేమో అనే ఉద్దేశ్యంతో గోపీచంద్‌ను ఒక్కడు నుండి తప్పించారు.
దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రకు గోపీచంద్ అయితే చాలా బాగుంటుందని అనుకున్నాడట. కాని అది సాధ్యం కాలేదు. దాంతో ప్రకాష్ రాజ్‌తో కానిచ్చేశారు. ప్రకాష్ రాజ్ కూడా అద్బుతంగా ఆ పాత్రను చేశాడు. ఒక్కడు ఒక బ్లాక్ బస్టర్‌గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో నిలిచి పోయే సినిమా అయ్యింది. ఆ సినిమాను నిర్మించిన ఎంఎస్ రాజు గోపీచంద్‌తో ఖచ్చితంగా వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతో తన తదుపరి చిత్రం వర్షంలో విలన్ పాత్రను ఇచ్చాడు.
ఒక్కడు మిస్ అయినా కూడా వర్షం చిత్రంలో అద్బుతమైన విలనిజంతో నటించి మెప్పించి స్టార్‌గా ఎదిగాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోగా ఆఫర్లు వచ్చినా కూడా వర్షం పూర్తి అయ్యే వరకు వెయిట్ చేశాడట. వర్షం సినిమా హిట్ అవ్వడంతో మళ్లీ గోపీచంద్ హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఇప్పటి వరకు హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు.