NTR ఫోన్ నెంబర్ ని రాజీవ్ కనకాల తన ఫోన్ లో ఏమని SAVE చేసుకున్నాడో తెలుసా?
Ntr And Rajeev kanakala : సినిమా హీరోలు, హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి వచ్చిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.
కాగా రాజీవ్ కనకాల దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ప్రతీ సినిమాలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నాడు.ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు తెలిపాడు.
అయితే ఇందులో రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని కిడ్ (చిన్న పిల్లవాడు) అని తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడని, అంతేగాక ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ దినోత్సవం రోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సందేశాలు పంపిస్తూ ఉంటాడని తెలిపాడు.
ఈ సందేశాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పంపిస్తున్నాడని, తనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారని, కానీ రాజీవ్ కనకాల మాత్రం తనని ఇంకా చిన్న పిల్లాడే అనుకుంటున్నాడని సరదాగా చెప్పుకొచ్చాడు.