మాంసం కంటే బలమైన తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటిని తింటే అసలు వదిలిపెట్టరు
soya bean seeds Health Benefits In telugu : మారిన పరిస్టితుల కారణంగా మన పూర్వీకులు తినే ఆహారాలను తినటం అలవాటుగా చేసుకుంటున్నాం. అలాంటి ఆహారాలలో సోయా చిక్కుడు ఒకటి. పప్పు ధాన్యాల్లో ఒకటైన సోయా చిక్కుడును ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనిలో మాంసకృత్తులు., ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
మాంసం తినలేనివారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సోయా చిక్కుడులో ఇతర ఆహార పదార్ధాలతో పోలిస్తే 40శాతం ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. అలాగే calcium, విటమిన్ డి కూడా అధిక మోతాదులో లభిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చిన్న పిల్లలకు వీటిని ప్రతి రోజు పెడితే మానసికంగానూ, శారీరకంగానూ బలంగా ఉంటారు.
పిల్లల్లో ఎదుగుదలకు సహాయపడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా రావు.సోయా చిక్కుడులో సాపోనిన్ ఉండుట వలన సూక్ష్మజీవులను చంపి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సోయా లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి వేయకుండా నియంత్రణలో ఉండటం వల్ల బరువు కూడా తగ్గుతారు.
దీనిలో ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వీటిని తీసుకోవటం వలన పోషకాహార లోపం తగ్గుతుంది. సోయా చిక్కుడు గింజలను 12 గంటల పాటు నానబెట్టి ఉడికించి తినాలి. ఉడికిన గింజలను కూరల్లో కూడా వేసుకోవచ్చు. చాలా మంది సోయాచిక్కుడు గింజలు తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్యలు వస్తాయని భావిస్తారు. కానీ ఆ భావన తప్పు.
నానబెట్టి ఉడికించి లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. ఈ రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్ తినటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలా కాకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.