2 సార్లు జుట్టు రాలే సమస్య తగ్గి పలచగా ఉన్నజుట్టు ఒత్తుగా,పొడవుగా,నల్లగా మారటం ఖాయం
Hair Loss Home Remedies In Telugu : జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్త్రీలైనా పురుషులు అయిన అటువంటి జుట్టు కోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ వేల కొద్ది డబ్బును కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. జుట్టు రాలటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
మన జీవనశైల్లో మార్పులు, ఆహారపు అలవాట్లు, జుట్టుకు సరైన సంరక్షణ లేకపోవడం, ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో చుట్టూ రాలే సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఫాలో అయితే మంచి ప్రయోజనం పొందవచ్చు.
మీడియం సైజ్ బీట్రూట్ దుంపను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత మూడు మందార పువ్వులు, ఒక కప్పు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సి చేసిన మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో మూడు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, ఏడు చుక్కల వేప ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ట్రై చేయండి.
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు పెరగటానికి సహాయపడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.