కేవలం చిన్న ముక్క రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
Mulethi Health Benefits In telugu : ఎన్నో మూలికలను ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వాటిలో కొన్ని మూలికల పేర్లు.. అలాగే వాటి గురించి కూడా మనకు పెద్దగా తెలియదు. అలాంటి ములికలలో Athimadhuram ఒకటి. అతి మధురంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. Athimadhuram వేరును ఎండబెట్టి పొడిగా చేస్తారు.
మనకు మార్కెట్ లో అతి మధురం వేరు లేదా పొడి రెండూ లభ్యం అవుతాయి. చలికాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించటానికి సహాయపడి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
దీనిలో ఉండే ఎంజైమ్‌లు మాక్రోఫేజ్‌లు మరియు లింఫోసైట్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడతాయి. శరీరంలో ఎలర్జీలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు,వాపులను తగ్గించటానికి సహాయపడతాయి.
శ్వాస సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. గాయకులు తమ గాత్రాన్ని మెరుగుపరుచు కోవటానికి వాడుతూ ఉంటారు. ఉబ్బసం, దగ్గు, ఆయాసం,గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే వీటిలో ఉండే లక్షణాలు చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కలిపి, ఇది చర్మపు దద్దుర్లు మరియు పిగ్మెంటేషన్ వంటి అనేక చర్మ వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
ఒత్తిడి,ఆందోళన వంటివి ఉన్నప్పుడూ అతి మధురంను తీసుకుంటే చాలా ప్రశాంతత కలుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మరియు శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. అతి మధురం తీసుకొనే మోతాదు గురించి ఆయుర్వేదం నిపుణులను సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.