Garlic Vs Ginger:వెల్లుల్లి Vs అల్లం…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
Garlic vs Ginger Health Benefits : వెల్లుల్లిలో ఇతర కూరగాయల కంటే ఎక్కువ కేలరీలు, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లు ఉన్నాయి. అల్లంలో ఇతర సుగంధ ద్రవ్యాల కంటే బలమైన యాంటీఆక్సిడెంట్ సామర్ధ్యం,యాంటీమెటిక్ లక్షణాలు ఉన్నాయి. అల్లంలో యాంటీఅలెర్జిక్ లక్షణాలు ఉన్నాయి.
వెల్లుల్లి మరియు అల్లం రెండింటిలో అధిక కాల్షియం, క్యాలరీలు, కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్ మరియు పొటాషియం కంటెంట్ ఉన్నాయి. అల్లం కంటే వెల్లుల్లిలో 28.2 రెట్లు సంతృప్త కొవ్వు ఉంటుంది.అల్లం కంటే వెల్లుల్లిలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది, అల్లంలో నియాసిన్ మరియు ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి.వెల్లుల్లిలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. అల్లంలో అధిక ప్రోటీన్,ఐరన్ సమృద్దిగా ఉంటాయి.
వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన జింజెరాల్ సమృద్దిగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
అల్లం,వెల్లుల్లి రెండింటిలోను ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లికి బలమైన వాసన ఉంటుంది. రెండు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రెండింటినీ లిమిట్ గా తీసుకుంటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.