Pawan kalyan కి 1998 ప్రత్యేక సంవత్సరం… ఎందుకో తెలుసా?
Pawan Kalyan 1998 Movies : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆనందపడతారు. అలాగే ఎన్ని రోజులు అయినా ఎదురు చూడటానికి సిద్దంగా ఉంటారు. మెగాస్టార్ సోదరునిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . ఎంట్రీ ఇచ్చాక తొలి సినిమా 1996లో విడుదలైంది. తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి చిరంజీవి చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో ఈ రోజు పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు.
తమ్ముడు, బద్రి, ఖుషీ వంటి సినిమాలతో టాప్ హీరో అయిపోయాడు. అయితే పవన్ కెరీర్‌లో మాత్రం ఓ ఏడాది చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. అదే 1998 వ సంవత్సరం. ఆ ఏడాది రెండు సంచలన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి పవర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ కొంచెం తేడా కొట్టినప్పటికీ 1997లో గోకులంలో సీత పర్వాలేదనిపించింది.
ఈ రెండు మూవీస్ గుర్తింపు అయితే తీసుకొచ్చాయి. కానీ పవన్ కోరుకున్న ఇమేజ్ దక్కని సమయంలో 1998 పవన్ కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పింది. ఆ ఏడాది ఈయన చేసిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. దాంతో తిరుగులేని హీరోగా నిలబడ్డాడు పవన్. అందులో ఒకటి భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించగా.. మరొకటి కరుణాకరణ్ తెరకెక్కించాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాను తెలుగులో సుస్వాగతం పేరుతో భీమినేని రీమేక్ చేసాడు. పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా కాసిన్ని మార్పులు చేసి తీసుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక 1998, జనవరి 1న విడుదలైన సుస్వాగతం బ్లాక్‌బస్టర్ అయింది. అందులో డైలాగులు ఇప్పటికీ ఫేమస్సే.
ప్రకాశ్ రాజ్ చేసిన మోనార్క్ క్యారెక్టర్ సినిమాకు మరో హైలైట్. ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణ అతిథిగా వచ్చాడు. అదే ఏడాది కొత్త దర్శకుడు కరుణాకరణ్ తెరకెక్కించిన తొలిప్రేమ జులై 24 న విడుదలై సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఒక్కొక్కరు ఈ సినిమాను పదేసి సార్లు చూసారంట. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను కరుణాకరణ్ తెరకెక్కించాడు. సుస్వాగతం, తొలిప్రేమ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూడలేదు.