1 స్పూన్ పొడి ఇలా తీసుకుంటే అలసట, నీరసం, నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు
Home Made Energy powder In telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, సరైన వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
సమస్యలు వచ్చాక జాగ్రత్త పడటం కన్నా సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే సరిపోతుంది. ఈ పొడి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టి పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్ నట్స్, పావు కప్పు వేరుశనగ, ఒక కప్పు పూల్ మఖానా వేసి డ్రై గా వేగించాలి.
బాగా వేగాక పొడి చేసుకొని బౌల్ లో వేయాలి. ఆ తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్ల సొంపు, ఒక స్పూన్ మిరియాలు, మూడు స్పూన్ల పుచ్చ గింజల పప్పు వేసి వెగించి పొడి చేసుకొని బౌల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు ఖర్జూరాలను గింజలు తీసేసి ముక్కలుగా చేసి అదే పాన్ లో వెగించి పొడి చేయాలి. తయారుచేసుకున్న అన్నీ పొడులను ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి.
దీనిలో పటికబెల్లం పొడి వేసి కలపాలి. ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడిని వేసి తాగాలి. ఈ విధంగా తాగటం వలన రోజంతా నీరసం,నిసత్తువ,అలసట లేకుండా హుషారుగా ఉంటారు. కంటికి సంబందించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాస్త ఓపికగా ఈ పొడిని తయారుచేసుకొని శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చలికాలంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ పొడిలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇటువంటి powders మార్కెట్ లో కూడా దొరుకుతాయి. కానీ ఇంటిలో చేసుకుంటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.