MoviesTollywood news in telugu

రాయలసీమ రామన్న చౌదరి సినిమా గురించి నమ్మలేని నిజాలు… అసలు నమ్మలేరు

Mohan Babu Rayalaseema ramanna chowdary Full Movie : మోహన్ బాబు విలన్ నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసాడు. ఒక్కోసారి ఎంత మంచి సినిమా అయినా సరే, అంచనాలను తలకిందులు చేస్తూ, దెబ్బతినేస్తుంది. దీనికి ఎన్నో కారణాలుంటాయి. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 500వ సినిమా గా వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి హిట్ కాలేదు.

500వ సినిమా కోసం మంచి కథ రెడీ చేయాలంటూ పరుచూరి బ్రదర్స్ ని మోహన్ బాబు కోరారు. అదే సమయంలో రజనీకాంత్ రాసిన రెండు సినిమా కథలు ఉన్నాయి. అందులో ఒకటి బాబా మూవీని తానే చేద్దామని, రెండో మూవీ ఆప్త మిత్రుడు మోహన్ బాబుకి ఇచ్చారు. పెదరాయుడు మూవీ గతంలో చేయమని చెప్పిన రజనీకాంత్ స్వయంగా ఇచ్చిన కథ కావడంతో నేటివిటీకి తగ్గట్టు మార్చుకోమని చెప్పడంతో, ఆ కథను పరుచూరి బ్రదర్స్ కి ఇచ్చి రెడీ చేయమని మోహన్ బాబు చెప్పారు.

మొత్తానికి డైలాగ్ వెర్షన్ తో సహా పరుచూరి సోదరులు రెడీ చేసారు. రాయలసీమ రామన్న చౌదరి టైటిల్ కూడా పెట్టేసారు. సురేష్ కృష్ణను డైరెక్టర్ గా ప్రిఫర్ చేసారు. జోడిగా జయసుధను తీసుకున్నారు. గృహప్రవేశం తర్వాత ఈ సినిమా ఇద్దరికీ కుదిరింది. రెండో మోహన్ బాబుగా ఎవరో యాక్టర్ చేత చేయిద్దామనుకుని అది కూడా ఆయనే వేశారు. ప్రియాగిల్ జోడీగా సెలెక్ట్.

చంద్రమోహన్, ప్రేమ, జయప్రకాశ్ రెడ్డి, నెపోలియన్ లతో తారాగణం సెలెక్ట్. మణిశర్మ మ్యూజిక్. 2000మే10న కొలచిలో షూటింగ్ స్టార్ట్. రజనీకాంత్ చీఫ్ గెస్ట్. తిరుపతి, రాజమండ్రి, రామానా యుడు స్టూడియో తదితర చోట్ల పూర్తిచేశారు. ఎఫెక్ట్స్ ఈ మూవీలో వాడారు. నాలుగు నెలల వ్యవధిలో మోహన్ బాబు రెమ్యునరేషన్ కాకుండా మూడు కోట్ల బడ్జెట్ లోపులోనే తీశారు.

సినిమాలో గుర్రపు బండి సీన్ లో మోహన్ బాబుకి దెబ్బలు తగలడంతో ఆగస్టులో రిలీజ్ కావాల్సిన సినిమా సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది. ప్రివ్యూ లో కూడా టాక్ బాగుండడంతో అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 15న రిలీజ్. డైలాగులకు, నటనకు థియేటర్ విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. తొలిరోజు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. చివరికి ఏవరేజ్ గా మిగిలింది.

కారణాలు చూస్తే, .. మొదటి భాగంలో పవర్ ఫుల్ గా చూపించి, రెండో భాగంలో లొంగిపోయేలా చేయడం తేడా కొట్టింది. ఇక క్లైమాక్స్ లో పుంజుకున్నప్పటికీ, రామన్న చౌదరి క్లైమాక్స్ లో చనిపోవడం ఆడియన్స్ కి నచ్చలేదు. నాస్తికవాదం, దైవం, ఫిలాసఫీ ఈ అంశాలు జనానికి కనెక్ట్ కాలేదు. ఈ మూవీకి ముందు రోజు నిన్నే ప్రేమిస్తా రిలీజై , బాగా ఆడుతుంటే, మరో రెండు వారాలకు ఆజాద్ మూవీ వచ్చింది. ఆతర్వాత జయం మనదేరా మూవీ రావడంతో చాలా థియేటర్స్ లో రామన్న చౌదరి తీసేసారు. ఆతర్వాత నువ్వే కావాలి వచ్చి, ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. దాంతో రామన్న చౌదరి మూవీ విజయానికి చేరువ కాలేక పోయింది.