Healthhealth tips in teluguKitchen

ఉదయం చిన్న పచ్చి కొబ్బరి ముక్క తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో… అసలు నమ్మలేరు

Raw Coconut health benefits In telugu : సంవత్సరం పొడవునా విరివిగా లభించే పచ్చి కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుందని,కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే వారంలో మూడు సార్లు చిన్న పచ్చి కొబ్బరి ముక్క తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి గుండెకు సంబందించిన సమస్యలు ఉండవు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
gas troble home remedies
దీనిలో బి కాంప్లెక్స్ తో పాటూ విటమిన్లు, ఫొలేట్లు, రైబో ఫ్లేవిన్, నియాసిన్, థయామిన్ లభిస్తాయి. అందువల్ల నోటి పూత సమస్య కూడా తగ్గుతుంది. పచ్చి కొబ్బరిలో 61 శాతం ఫైబర్ ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరిలో మీడియం చెయిన్‌ ట్రై గ్లిజరైడ్స్‌ ఉంటాయి. ఇవి కీటోజెనిక్‌ గుణాలను కలిగి ఉంటాయి.
saraswati Plant
అందువల్ల అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఎదిగే పిల్లలు, ప్రొటీన్‌తో పాటు ఇతరత్రా పోషకాల లోపంతో బాధపడేవారు రోజూ రెండు స్పూన్ల కొబ్బరి తురుముని తీసుకుంటే సరి. కండరాలు వృద్ధి చెందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలు ఉండవు.

కొబ్బరి శరీరానికి శక్తినిస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. చర్మంపై ముడతలు,మచ్చలు లేకుండా చేస్తుంది. మూత్ర విసర్జనలో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గించటానికి కొబ్బరిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. చిన్న కొబ్బరి ముక్క తింటే చాలు. అతిగా తింటే ఏదైనా అనర్ధమే కదా…లిమిట్ గా తీసుకొని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.