Healthhealth tips in teluguKitchen

యూరిన్ ఇన్ ఫెక్షన్, మూత్రంలో మంట,నొప్పి తగ్గటమే కాకుండా శరీరంలో వేడి కూడా ఉండదు

Urinary tract infection Home remedies in telugu : మారిన జీవనశైలి మరియు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్ మరియు వాపుకు గురవుతుంది.
Urine Infection Home Remedies In Telugu
మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం. దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది.
Garlic side effects in telugu
కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యూరిన్ ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడు అల్లం,వెల్లుల్లి చాలా బాగా సహాయపడతాయి. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను ఉడికించి తీసుకోవాలి.లేదా వెల్లుల్లిని పాన్ లో వేసి నూనె లేకుండా వేగించి కూడా తీసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటానికి సహాయపడతాయి.
Ginger benefits in telugu
ఒక స్పూన్ అల్లం రసం తీసుకోవాలి. అల్లంలో ఉండే జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఇన్ ఫెక్షన్ తగ్గటానికి సహాయపడుతుంది. ఈ విధంగా అల్లం,వెల్లుల్లి తీసుకుంటూ డాక్టర్ సూచనలను పాటిస్తే చాలా తొందరగా యూరిన్ ఇన్ ఫెక్షన్ నుండి బయట పడవచ్చు. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే కొబ్బరి నీరు,మజ్జిగ, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
Benefits Of Drinking Water Empty stomach
యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు. ఆహారంలో మార్పులు చేసుకొని ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇటువంటి సమస్యలను అసలు అశ్రద్ద చేయకూడదు. సమస్య తీవ్రంగా ఉంటె మాత్రం డాక్టర్ ని సంప్రదించటం మంచిది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.