Malliswari సినిమా కోసం కత్రినా కైఫ్ ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?
Malliswari Movie Heroine Katrina Kaif : విజయ్ భాస్కర్ దర్శకత్వంలో Venkatesh హీరోగా వచ్చిన Malliswari Movie ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో Katrina Kaif హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వెంకటేష్, బ్రహ్మానందం, కత్రినా కైఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా కామెడీని పండించాయి.
మల్లీశ్వరి సినిమాతోనే టాలీవుడ్ కి కత్రినాకైఫ్ ఎంట్రీ ఇచ్చింది. కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో నటించే సమయానికి బాలీవుడ్లో కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం పారితోషికం భారీగానే ఇచ్చారట. ఆమెకు 70 లక్షల రూపాయల వరకు ఇచ్చారట.
అప్పట్లో ఇది అత్యధిక పారితోషికం. ఆ తర్వాత మరొక సినిమాలో నటించింది. అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో ఆడిపాడింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది. ఇక తెలుగు సినిమాల జోలికి రాలేదు.