MoviesTollywood news in telugu

భలే భలే మగాడివోయ్ సినిమాను ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేసారో తెలుసా ?

Nani Bhale Bhale Magadivoy Movie : మారుతి దర్సకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ముందుగా నాని వద్దకు కాకుండా వేరే హీరోల వద్దకు వెళ్ళితే… వారు రిజెక్ట్ చేసారు. టాలీవుడ్ లో స్వశక్తితో మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత అలా మొదలైంది సినిమా చేసి హిట్ కొట్టాడు.

రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఈగ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈగ సినిమాలో కొంతసేపే కనిపించినా తనదైన ముద్రను వేశాడు నాని. ఆ తర్వాత కొన్ని రోజులు పరాజయాలు పలకరించాయి. భలే భలే మగాడివోయ్ సినిమాను మారుతి దర్శకత్వంలో చేసి మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ సినిమా చేశాక నానికి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

అయితే ఈ సినిమాను మారుతి నాని కంటే ముందుగా ముగ్గురు హీరోలకు కథ వినిపించాడట. ఆ ముగ్గురు రిజెక్ట్ చేశాక నాని వద్దకు వచ్చాడట. నాని వెంటనే ఓకే చెప్పేయడం సినిమా చేయటం సినిమా హిట్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఆ ముగ్గురు హీరోలు ఎవరా అని ఆలోచిస్తున్నారా. ఎవరంటే నాగ చైతన్య, అల్లరి నరేష్, సునీల్. ఈ ముగ్గురు రిజెక్ట్ చేసిన సినిమాను నాని చేసి హిట్ కొట్టాడు.