1987 సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో విజేత ఎవరు ?
1987 Sankranthi Movies Winner In telugu : తమ అభిమాన నటుల సినిమాల గురించిన వివరాలు తెలుసుకోవటానికి ప్రతి అభిమాని చాలా ఆసక్తిని చూపుతారు.
ప్రతి యేటా సంక్రాంతి,దసరా,సమ్మర్ ఇలా కొన్ని ప్రత్యేక పండుగలు,సమయాల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్ అయితే, కొన్ని హిట్ అవుతాయి. ఇక ఇదే క్రమంలో 1987 సంక్రాంతికి కృష్ణ,శోభన్ బాబు,చిరంజీవి,బాలకృష్ణ ,నాగార్జున,రాజేంద్ర ప్రసాద్ ల సినిమాలు రిలీజయ్యాయి.
ముందుగా జనవరి 9న చిరంజీవి నటించిన దొంగమొగుడు మూవీ వచ్చింది. చిరంజీవి డబుల్ యాక్టింగ్ చేసిన ఈ మూవీని ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసారు. భానుప్రియ,మాధవి, రాధిక హీరోయిన్స్ గా నటించారు. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీలో డైరెక్టర్,నిర్మాతకు వచ్చిన విభేదాలతో డైరెక్ట్ 100రోజులు లేకుండా పోయింది. తిరుపతిలో షిఫ్ట్ లతో 365రోజులు ఆడింది.
జనవరి 14న చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణ ,రాధ నటించిన తండ్రీకొడుకుల ఛాలెంజ్ మూవీ మంచి ఓపెనింగ్స్ వచ్చినా, ఏవరేజ్ అయింది. అదేరోజు బాలయ్య, విజయశాంతి నటించిన భార్గవరాముడు మూవీ వచ్చింది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ షిఫ్ట్ ల మీద కొన్ని కేంద్రాల్లో 100డేస్ ఆడింది. శోభన్ బాబు నటించిన పున్నమి చంద్రుడు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సుహాసిని హీరోయిన్ గా నటించింది. సుమలత కూడా నటించింది. ఇక దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో నాగార్జున నటించిన మజ్ను మూవీ కూడా అదే రోజు రిలీజయింది.
రజని హీరోయిన్ గా చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఒక్క సెంటర్ లో 100డేస్ ఆడింది. పెద్ద హీరోలతో పోటీపడి వచ్చిన మజ్ను ఇలా హిట్ కావడం సాధారణ విషయం కాదు. సంసారం ఒక చదరంగం మూవీ తక్కువ అంచనాల మధ్య వచ్చి,రికార్డు నెలకొల్పిన మూవీగా నిల్చింది. రాజేంద్రప్రసాద్,శరత్ బాబు, సుహాసిని, గొల్లపూడి, ముచ్చెర్ల అరుణ,షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఎస్పీ ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో బాగా ఆడింది. ఇలా ఏ సినిమాకు ఆ సినిమా తన రేంజ్ కి తగ్గట్టు సత్తా చూపింది.