Jabardasth కి రాక ముందు గెటప్ శ్రీను ఏమి చేసేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Jabardasth getup srinu : ఈ టివీలో ప్రసారం అవుతున్న Jabardasth షో ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిన విషయమే. ఏదో కొందరు మినహా ఎవరైనా కష్టపడితే పైకి వస్తారని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ ప్రోగ్రామ్ లో దుమ్మురేపుతున్న గెటప్ శ్రీను విషయానికి వస్తే, బుల్లి తెర రంగంలో స్టార్ ఆర్టిస్ట్ గా పేరొంది, ప్రస్తుతం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నా, ఒకప్పటి జీవితం మాత్రం వడ్డించిన విస్తరి కాదు.
ఎన్నో కష్టాలు పడి ఓ స్థాయికి ఎదిగిన గెటప్ శ్రీను పొట్టకూటి కోసం ఒకప్పుడు కూలి పనులు కూడా చేసాడు. ఇది నమ్మకపోయినా ఇది ముమ్మాటికీ నిజం. కొందరు పుట్టకతో బంగారు స్పూన్ అదే శ్రీమంతునిగా పుడితే, మరి కొందరు కటిక పేదరికంలో పుడతారు. పేదరికంలో పుట్టి తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహించే వ్యక్తుల్లో గెటప్ శ్రీను ఒకడు.
జబర్దస్త్ ఎంటర్ టైన్ మెంట్ షో తో ఒక్కసారిగా తారాపథం చేరిన కామెడీ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను అంటే తెలియని తెలుగువాడంటూ ఉండరు. అంతగా పాపులర్ అయ్యాడు. కేవలం టివి షోలకే పరిమితం కాకుండా సినీ రంగంలో కూడా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉండేవాడు. మరి ఈనాడు అనూహ్యంగా ఈస్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయమే కదా.
గెటప్ శ్రీను అసలు పేరు బోడుపల్లి శ్రీను. ఈతడు 1984డిసెంబర్ 12న కళింగ పాలెంలో జన్మించాడు. తల్లిదండ్రులది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం కావడంతో ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉండేవి. ఫలితంగా చిన్నతనంలో కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఇతనికి ఓ అన్న, ఓ అక్క వున్నారు. చదువుకోసం, పుస్తకాలకోసం డబ్బుల్లేక శ్రీను ఉదయాన్నే లేచి పొలం పనులకు వెళ్ళేవాడు. మధ్యాహ్నం నుంచి స్కూల్ కి వెళ్లేవాడట.
అలా ఒకపూట స్కూల్ కి వెళ్లి, సాయంత్రం కూడా పనికి వెళ్ళవాడు. ఊళ్ళో చెరుకు మిషన్ దగ్గర సాయంత్రం పనిచేసేవాడు. ముఖ్యంగా అక్క పెళ్ళికి అప్పులవ్వడంతో గెటప్ శ్రీను ఇలా కూలి పనులకు వెళ్ళక తప్పలేదు. ఇంట్లో తిండిలేని పరిస్థితి దాపురించడంతో ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువు కొనసాగించాడు. సెలవులు ఇస్తే, అందరూ హాస్టల్ ఖాళీ చేసి, తమతమ ఇళ్లకు వెళ్తే, గెటప్ శ్రీను మాత్రం పొలాలకు వెళ్లి పనులు వెతుక్కునేవాడు.
అలా గడ్డిమోపులు కట్టడం,కుప్పనూర్చడం వంటి పనులలో నిమగ్నమయ్యేవాడు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ విషయాలు వివరిస్తూ కంటతడి పెట్టుకున్నాడు. స్కూల్ డేస్ లో కష్టాలు మరిచిపోడానికి అందరినీ నవ్విస్తూ గడిపేసిన గెటప్ శ్రీనుకి అందరినీ నవ్వించడమే తన వృత్తి అవుతుందని ఆనాడు ఊహించలేదు. ఇక ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేనాటికి కూడా ఇంట్లో పరిస్థితిలో పెద్దగా తేడా లేకపోవడంతో, ఇంట్లో ఉండే అందరూ పనిచేస్తేనే ఇల్లు గడిచేది కాదు. అలాగని ఉపాధికోసం సిటీ వస్తే, ఎన్నో కష్టాలు పడ్డాడు.
ఓసారి అన్నపూర్ణ స్టూడియోలో ఎదురైన అవమానం భరించలేక సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడే సి ఛానల్ లో అవకాశం రావడంతో గెటప్ శ్రీను జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్క్రిప్ట్ రైటర్ గా,లీడ్ ఆర్టిస్ట్ గా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నాడు.