Mustard seeds for dandruff:ఆవాలుతో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది
Mustard seeds for dandruff:ఆవాలుతో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది.. ఈ చలికాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తూ ఉంటాయి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ సమయంలోనే బయట పడవచ్చు. చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. చలికాలంలో అయితే మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది.
చుండ్రు సమస్య రాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాకి ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.
పొయ్యి మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల ఆవాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి…కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి తురమాలి. ఈ తురుము నుండి రసాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో ఆవాల పొడి, ఉల్లిపాయ రసం, ఒక గుడ్డు తెల్ల సోన, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటే ఈ రెమెడీని వారంలో రెండుసార్లు ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఆవాలు నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఆవాలులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును వదిలించుకోవడంలో కూడా సహాయపడుతుంది. స్కాల్ప్ మరియు జుట్టు సమస్యలను తగ్గించుకోవటానికి ఆవాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ రసంలో యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ చిట్కాను ఫాలో అయితే చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u