డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పును తింటే ఏమి అవుతుందో తెలుసా?
Soaked almonds for diabetes In Telugu : డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అశ్రద్దగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా హార్ట్ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏ ఆహారాలు తినాలో తెలియక ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలను కూడా దూరం పెడుతూ ఉంటారు. అలాంటి ఆహారాల్లో బాదం పప్పు ఒకటి.
చాలామంది డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పు తినకుండా మానేస్తుంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పులను తినవచ్చు. అయితే ఎక్కువ తినకుండా రోజుకు నాలుగు బాదం పప్పులను నానబెట్టి తీసుకుంటే మంచిది. బాదం పప్పును పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పోందవచ్చు. బాదంపప్పు నానబెట్టి తింటేనే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
బాదం పప్పు లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, మెగ్నీషియం ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా పని చేస్తాయి. అలాగే అధిక బరువు సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలను 30 శాతం తగ్గించటంలో బాదం పప్పు సహాయపడుతుంది.
అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బాదం పప్పు తిని డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చూసుకోండి. బాదాం పప్పులో ఉన్న పోషకాలు ఎన్నో సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. బాదాం పప్పు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. అందరికి అందుబాటు ధరలోనే ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.