డయాబెటిస్ ఉన్నవారు దాల్చినచెక్క తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?
Cinnamon blood sugar management In Telugu : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడకుండా డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వారికి ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి సరిగా పనిచేయక పోవడం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది..
మారిన జీవనశైలి అలవాట్లు, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను మనం ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తాం. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.
దీనిలో ఉండే యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలైన బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి సహాయపడతాయి. ఇక దాల్చిన చెక్క పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ వేడి నీటిలో పావు స్పూన్ లో సగం వేసి బాగా కలిపి తీసుకోవాలి. లేదా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి 4 నిమిషాల పాటు మరిగించాలి.
బాగా మరిగిన ఆ నీటిని వడకట్టి కూడా తాగవచ్చు. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు నుంచి కూడా బయట పడటానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.