Healthhealth tips in telugu

ఆవనూనెతో అరికాళ్లకు మసాజ్ చేస్తే ఏమి అవుతుందో తెలుసా…?

Mustard oil massage Benefits : ఆవ నూనెను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే ఆవనూనె ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవనూనెను పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆవనూనెతో తయారుచేసిన ఆహారం చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Mustared oil Benefits in telugu
ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా మనలో చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటివారు గోరువెచ్చని ఆవనూనెతో అరికాళ్ళకు మసాజ్ చేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి, టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఆవ నూనె మంచి ఉపశమనం కలిగిస్తుంది.
Feet Care Tips
ఆవనూనెతో శరీరానికి మసాజ్ చేయడం వల్ల చీలమండ, మడమ, కీళ్ల ఎముకలు బలపడతాయి. దీనితో పాటు దృఢత్వం మరియు వాపు సమస్య కూడా తగ్గుతుంది. చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఆ నొప్పులను తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజంతా పని చేయడం వల్ల అలసిపోయి పాదాల్లో నొప్పిగా అనిపిస్తే.. రాత్రి పడుకునేటప్పుడు ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి.
Joint Pains
ఆవనూనెతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టే సమస్య ఉండదు. రాత్రి పడుకునే ముందు ఆవాల నూనెను అరికాళ్లకు మసాజ్ చేస్తే ఒత్తిడి లేకుండా నిద్ర పడుతుంది. నిద్రలేని సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణ సంబంధిత సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల ఆవాల నూనెను నాభిలో వేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం క్లియర్‌గా మారుతుంది. దీంతో పాటు మొటిమలు, మొటిమల సమస్య కూడా దూరమవుతుంది. కంటికి సంబందించిన సమస్యలను తగ్గించి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ఈ చలికాలంలో ఆవ నూనెను ఉపయోగించి ఈ సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.