NTR తొలి సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా ?
Ntr First heroine smitha madhav : తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటారు. నందమూరి తారకరామారావు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. రాముడు,కృష్ణుడు అంటే ఇలా ఉంటారా అని నిరూపించిన హీరో ఎన్టీఆర్. ఆయన నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ,కల్యాణ చక్రవర్తి,తారక రత్న,కళ్యాణ్ రామ్ ఇలా చాలామంది వచ్చినా,అచ్చం ఎన్టీఆర్ పోలికలతో ఉండే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. మాస్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ, స్టెప్స్, ఫైట్స్ తో అలరిస్తూ, హీరోగా తనకంటూ ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, హీరోగా హిట్ అందుకున్న ఘనత కూడా తారక్ కి చెందుతుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో ఎం ఎస్ రెడ్డి నిర్మించిన బాల రామాయణం మూవీలో తారక్ రాముడి పాత్రలో అలరించాడు. అతడికి జోడీకి సీత పాత్రలో స్మితా మాధవ్ యాక్ట్ చేసి, అలరించింది. అయితే బాల రామాయణం తర్వాత స్మితా మాధవ్ మళ్ళీ కన్పించలేదు.
కానీ తారక్ పెద్దయ్యాక హీరోగా చూడాలని ఉంది మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి స్మితా మాధవ్ డాన్స్ వైపు అడుగులు వేసి, పూర్తి ప్రావిణ్యం సంపాదించింది. సంగీతంలో కూడా శిక్షణ తీసుకుంది. డాన్సర్ గా ఎన్నో స్టేజ్ షోస్ ఇవ్వడమే కాకుండా కొన్ని సినిమా పాటలకు డాన్స్ కంపోజ్ చేసింది. దేశవిదేశాల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ తో అలరిస్తోంది. అంతేకాదు,ఎంతోమంది శిష్యులను కూడా తయారుచేస్తోంది. దగ్గరుండి శిష్యుల డాన్స్ షోలను ఆరంగేట్రం చేయిస్తోంది.