Jagapati babu 1997 లో ఎన్ని హిట్స్ కొట్టాడో తెలుసా… అసలు నమ్మలేరు
Tollywood hero Jagapati babu 1997 Hit Movies : జగపతి బాబు ఏ పాత్ర పోషించిన ఆ పాత్రకు న్యాయం చేకురుస్తాడు. హీరోగా ఓ వెలుగు వెలిగి,ఛాన్స్ లు తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా తన సత్తా చాటుతున్న జగపతి బాబు ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా దుమ్మురేపాడు. ముఖ్యంగా 1997లో వచ్చిన సినిమాలు జగపతి బాబు కెరీర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి.
6 సినిమాలు చేస్తే, ఒక్కటి కూడా ప్లాప్ కాలేదు. రెండు కుటుంబాలను కలుపుతూ తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లాడనే ఇతివృత్తంతో వచ్చిన శుభాకాంక్షలు మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎస్ ఏ రాజ్ కుమార్ మంచి బాణీలు అందించాడు. రాశి హీరోయిన్. రవళి కూడా నటించింది.
అలాగే సౌందర్యతో కల్సి చేసిన ప్రియా రాగాలు మూవీ కూడా జగపతిబాబుకి మంచి విజయాన్ని అందించింది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించాడు. ఎమోషనల్ ఎంటర్టైన్ మెంట్ తో సాగె మూవీలో మహేశ్వరీ కూడా నటించింది. ఒకరికొకరు అనుకోకుండా పెళ్లి చేసుకున్న జగపతి బాబు, ఇంద్రజ లు రైలు ప్రమాదంలో అందరినీ పోగొట్టుకుని ఎలా ఒక్కటయ్యారన్న ఇతివృత్తంతో వచ్చిన ఒక చిన్నమాట మూవీ మరో విజయాన్ని అందించింది.
కామెడీ,ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ చేసాడు. ఇదే ఏడాది వచ్చిన దొంగాట సినిమా కూడా మరో హిట్ ఇచ్చింది. జగపతి బాబు, సౌందర్య, సురేష్ నటించిన ఈ మూవీని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసాడు. మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిలకొట్టుడు మూవీ ఏవరేజ్ గా నిల్చింది.
అయితే కన్నడ ఫిలిం అనురాగ సంగమ కు రీమేక్ గా వచ్చిన పెళ్లిపందిరి మూవీతో జగపతి బాబు హిట్ అందుకున్నాడు. ఫ్రెండ్షిప్ కోసం ప్రేమను త్యాగం చేసే స్నేహితుడుగా జగపతి బాబు నటన అద్భుతం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి హీరోయిన్.