Rajasekhar సూర్యుడు సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Tollywood Hero Rajasekhar Suryudu Movie : తమ అభిమాన హీరో సినిమా గురించి విషయాలను తెలుసుకోవటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు. సినిమా కథ రాసేటప్పుడే ఫలానా హీరోని దృష్టిలో పెట్టుకుని రాయడం ఇప్పుడు అలవాటై పోయింది. తీరా సదరు నటుడు నో చెబితే మరొకరితో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ప్లాప్ అయితే పొతే పోయిందిలే అనుకుంటారు.
కానీ బ్లాక్ బస్టర్ కొడితే అయ్యో మిస్సయ్యామా అని ఫీలవుతారు. ఇది ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఇక మెగాస్టార్ చిరంజీవి,నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా కాదన్న మూవీ మరో హీరో పాలిట వరమైంది. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఒక ఇంటర్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈయన తీసిన చిత్రాల్లో 80శాతం హిట్ కొట్టాయి.
ఇందులో మెగాస్టార్ నటించిన హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఈయన దాదాపు 50సినిమాలు డైరెక్ట్ చేసాడు. 2008లో రిలీజైన ఆలయం మూవీ ఈయన ఆఖరి సినిమా. తర్వాత సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే గతంలో సూర్యుడు మూవీ కథను తయారు చేసాక మెగాస్టార్ చిరంజీవిని, ఆతర్వాత బాలయ్యను కల్సి వినిపించారట.
దాదాపు ఆరు నెలలు స్క్రిప్ట్ చూసి, ఇద్దరూ నో చెప్పారు. దాంతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ రాజశేఖర్ తో ఇదే సినిమా తీస్తే, హిట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాజశేఖర్ నటన అదిరిందని ముత్యాల సుబ్బయ్య గుర్తుచేసుకున్నారు.