Aravinda sametha సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Aravinda sametha full movie : ఒక హీరో దగ్గరకు వచ్చిన సినిమా మరొక హీరో చేయటం ఈ రోజుల్లో చాలా సర్వ సాధారణం అయ్యిపోయింది. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 2018 అక్టోబర్ లో వచ్చింది. అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుండి వచ్చిన ఈ సినిమా మీద వాస్తవంగా అందరూ అనుమానాలని వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ, వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ కమర్షియల్ హిట్ గా నిలిచింది.
150 కోట్ల కి పైనే వసూళ్ళని రాబట్టింది. పూజా హెగ్డే ఎన్.టి.ఆర్ సరసన నటించిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై ఎస్.రాధా కృష్ణ నిర్మించారు. ఎన్.టి.ఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒక్కటే ప్రేక్షకులను థియోటర్స్ లో కట్టి పడేసింది. అంతటి భారీ యాక్షన్ సీన్ ని ఎంతో అద్భుతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఈ ఫైట్ లో ఎన్.టి.ఆర్ ఎలివేషన్ కి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఇక థమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ అయింది. నిజానికి ఈ కథ ని పవన్ కళ్యాణ్ కోసమే త్రివిక్రమ్ రాసాడట.
అజ్ఞాతవాసి ఫ్లాప్ ఫ్యాన్స్ తో పాటు అందరిని దారుణంగా నిరుత్సాహపరచడంతో ఎలాగైనా మళ్ళీ పవర్ స్టార్ కి ఒక భారీ సక్సస్ ఇవ్వాలన్న కసితో అరవింద సమేత కథ రాసి పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. కాని ఈ కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ ఈ కథ నాకంటే ఎన్.టి.ఆర్ కి చాలా బావుంటుంది.. సినిమా సూపర్ హిట్టవుతుంది …మనం ఇంకో సినిమా చేద్దాం…ఏమాత్రం ఆలోచించకుండా ఈ కథ ఎన్.టి.ఆర్ కి నచ్చితే చేసేయ్ అని పవన్ చెప్పడంతో ఈ సూపర్ హిట్ సినిమా ఎన్.టి.ఆర్ ఖాతాలో పడింది.