ఆవాలే కదా అని ఏరి పారేస్తున్నారా.. అయితే ఈ నిజం తెలిస్తే అసలు వదలరు
Mustard seeds Health Benefits In Telugu : ఆవాలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా మంది ఆవాలు అంటే పెద్దగా ఇష్టపడరు. వీటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదలకుండా తినటం అలవాటు చేసుకుంటారు. ఆవాలు అనేవి మన వంటగదిలో పోపుల పెట్టెలో ఉండే ఒక దినుసు. అవాలులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
ప్రతి రోజు ప్రతి ఇంటిలో కూరలు చేసినప్పుడు తాలింపులో తప్పనిసరిగా వాడతారు. ఆవాలు వంటకు మంచి రుచిని,వాసనను అందిస్తుంది. అవాలులో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొన్ని ఆవాలు వేసి ఆ నీటిని వడకట్టి పుక్కిలిస్తే పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఏమైనా గాయాలు అయినప్పుడు వాటిపై ఆవపొడి రాస్తే త్వరగా తగ్గుతాయి. ఒక స్పూన్ ఆవపొడిలో తేనే కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కీళ్లనొప్పులు ఉన్నవారికి ఆవాలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది.
ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది. ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.
ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆవాలులో ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి కదా… వీటిని ఉపయోగించి ఆ ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నం చేయండి. ఆవాలు చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.