MoviesTollywood news in telugu

Upendra సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Upendra Movie Details : తమ అభిమాన నటుని గురించి విషయాలు తెలుసుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. పేరుకు కన్నడ నటుడైనా సరే, దక్షిణాది భాషల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు ఉపేంద్ర. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా అలాగే డిఫరెంట్ విలన్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్న ఉపేంద్ర పేరుతోనే ఓ సినిమా అప్పట్లో వచ్చింది.

సైకాలజికి అనుగుణంగా దిమ్మతిరిగేలా తీసిన ఆ సినిమా అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ఎన్నో సైకాలజీ పుస్తకాలను స్టడీ చేసిన ఉపేంద్ర ఓం,ఏ వంటి మూవీస్ తో ఇండస్ట్రీలో హీరో కమ్ డైరెక్టర్ గా ఓ ఊపు ఊపేసాడు. 1998లో తెలుగులో కన్యాదానం చేసే సమయంలోనే ఉపేంద్ర మూవీ స్క్రిప్ట్ రాసేవాడు. అప్పటికే రెండేళ్లుగా ఉపేంద్ర మూవీపై ఉపేంద్ర కసరత్తు చేయడం వలన కన్యాదానం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ అప్పట్లో ఉపేంద్ర స్టోరీ లైన్ చూసి ఆశ్చర్యపోయాడట.

అంతేకాదు తెలుగు రైట్స్ కోసం కూడా అప్పుడే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. అయితే కన్నడంలో శివరాజ్ కుమార్ తో చేయాలనీ భావిస్తే, దీనికి నువ్వే కరెక్ట్ నువ్వే చేయి అని శివరాజ్ చెప్పాడట. దాంతో కొందరు మానసిక వేత్తలను,కాలేజీ అమ్మాయిలను, ఇలా అందరిని కలిసి అందరి అభిప్రాయాలు క్రోడీకరించాడు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం కోసం ట్రై చేస్తే, ఖాళీ లేకపోవడంతో గురుకిరణ్ ని పెట్టుకున్నాడు.

హీరోయిన్ ప్రేమతో ఓ పోస్టర్ బయటకు రావడంతో ఈ మూవీ’ ఏ’మూవీ కన్నా బోల్డ్ గా ఉంటుందన్న ప్రచారం మరింత పెరిగిపోయింది. 1999అక్టోబర్22న భారీ హైప్ తో విడుదలైన ఉపేంద్ర మూవీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో హ్యూమన్ సైకాలజీ మీద నడిచి దిమ్మతిరిగిలా చేసింది. మనీ,బ్యూటీ, రెస్పాన్స్ బిలిటీ అనే మూడు సింబాలిక్ గా చూపిస్తూ వ్యామోహం,ప్రేమ,మధ్య తేడాను చూపించాడు. హీరో పేరు నేను. యాక్టింగ్ అదుర్స్ . సంగీతం సూపర్. కానీ కొందరు శాడిస్ట్ మూవీ అని అన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ప్రత్యేకంగా ఉపేంద్రను అభినందించారు.