Healthhealth tips in telugu

ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా…అసలు ఊహించలేరు

jaggery And Coriander seeds Benefits In telugu : మారిన పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన వంటింటిలో ఉండే పదార్ధాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మనం ప్రతి రోజు ఏదో ఒక రకంగా బెల్లం వాడుతూ ఉంటాం. బెల్లంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
jaggery Health benefits in telugu
ప్రతి రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా తినమని చెప్పుతున్నారు. అలాగే ధనియాలలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధనియాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని చెప్పవచ్చు. ధనియాలు యాంటీ బయటిక్ గా కూడా పనిచేస్తుంది.
dhaniyalu
జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న బెల్లం,ధనియాలను కలిపి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు దూరం అవుతాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించి ఎముకలు గుల్లబారడం, పేలుసుగా మారటం వంటివి కూడా ఉండవు.

నోటి దుర్వాసన సమస్య ఉన్నప్పుడు కూడా బెల్లం,ధనియాలు కలిపి తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గటమే కాకుండా చిగుళ్ళ సమస్యలు కూడా ఉండవు. ఈ మధ్య కాలంలో చాలా మంది మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి  పడుకోవటానికి అరగంట ముందు బెల్లం,ధనియాలను తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడతారు.
gas troble home remedies
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి  గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ధనియాలను,బెల్లం ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…ధనియాలను పొడిగా చేసుకోవాలి. అరస్పూన్ ధనియాల పొడిలో పావు స్పూన్ బెల్లం కలిపి తీసుకోవాలి. ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.