MoviesTollywood news in telugu

ANR, NTR, కృష్ణ, శోభన్ బాబు వీరిలో నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా?

Tollywood Heroes: తమ అభిమాన హీరో గురించి ఏ విషయం తెలిసిన ఆ అభిమాని ఆనందానికి హద్దు ఉండదు. భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు చిత్రసీమ కు గల ప్రత్యేకత వేరు. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ లను రెండుకళ్ళుగా భావిస్తారు. ఇందులో ఒకరిని తక్కువ, మరొకని ఎక్కువ అనలేం అంటూ అందరూ సమానంగా వీరికి ఓటేస్తారు.
Ntr And Anr Age
ఇక వీల్లిద్దరూ సినీ పరిశ్రమను ఏలుతున్న రోజుల్లో శోభన్ బాబు,కృష్ణ వచ్చి తమ సొంత ఇమేజ్ తో నిలదొక్కుకున్నారు. ఇలా ఈ నలుగురు ఎవరి టాలెంట్ వారిదే చూపిస్తూ, తెలుగు ఇండస్ట్రీని సుసంపన్నం చేశారు. ఇక ఆరోజుల్లో భేషజాలకు పోకుండా, తమలో ఎలాంటి పోటీ వున్నా, మంచి కథ దొరికితే మల్టీ స్టార్ మూవీస్ చేసిన ఘనత ఈ నలుగురిదీ.

ఇక అప్పటి రెమ్యునరేషన్ కోట్లలో లేకున్నా, వాళ్ళు తీసుకున్న లక్షలు ఇప్పటి కోట్లతో సమానం. వాళ్ళ సినిమాలు ఇప్పటికీ ఎవరు గ్రీన్ గా ఉండడం మరో విశేషం.
ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సినీ రంగంలో అడుగుపెట్టారు. పల్లెటూరి పిల్ల,మనదేశం,షావుకారు వంటి చిత్రాల్లో మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహజంగా అందగాడు కావడంతో ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి.

1951 పాతాళభైరవి చిత్రం తరువాత ఎన్టీఆర్ వెనుదిరిగి చూడలేదు. ఆ మూవీ అప్పట్లో 10కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. మొదట్లో నెలకు 500రూపాయలతో పాటు సినిమా చివరిలో 5వేలరూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక మాయాబజార్ మూవీలో 7,500పారితోషికం తీసుకుంటే అదే గొప్పగా చెప్పుకునే వారు. ఓ వైపు రామారావు జానపద,పౌరాణిక,సాంఘిక చిత్రాలతో రాణిస్తుంటే,మరోపక్క మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

రాముడు,కృష్ణుడు పాత్రలలో ఆయన సూటవ్వక్క పోవచ్చు గానీ ఏ ఎన్ ఆర్ నటనలో ఎవ్వరికీ తీసిపోడు. ఎన్టీఆర్ మాదిరిగా ఏ ఎన్ ఆర్ కూడా నాటకరంగం నుంచే వచ్చారు. పైగా ఎన్టీఆర్ కన్నా ముందే ఫీల్డ్ లోకి వచ్చిన నటుడు అక్కినేని. తెలుగులో పాటలు డాన్స్ లు వేసిన తొలి హీరో ఆయనే. ఈయన్నే చూసే ఎన్టీఆర్ కూడా స్టెప్పులు వేశారని అనుకునేవారు.

ధర్మపత్నితో ప్రారంభమైన అక్కినేని ప్రస్థానం,దేవదాసు,కీలుగుఱ్ఱం,చెంచు లక్ష్మి వంటి ఆణిముత్యాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ పద్మశ్రీతోనే సరిపెట్టుకుంటే,ఏ ఎన్ ఆర్ మాత్రం పద్మవిభూషణ్,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరో మల్టీస్టారర్ చిత్రాలు చేసి తమ మధ్య స్నేహాన్ని చాటుకున్నారు. మిస్సమ్మ,గుండమ్మ కథ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లు చిత్రసీమను ఏలుతున్న రోజుల్లో శోభన్ బాబు,కృష్ణ ఎంట్రీ ఇచ్చి విభిన్న చిత్రాలతో తమ సత్తా చాటారు. ఆడియన్స్ లో కొత్త ఫీలింగ్ తీసుకొచ్చారు. వీరాభిమన్యు ,మనుషులు మారాలి,సంపూర్ణ రామాయణం,జీవన తరంగాలు వంటి సూపర్ హిట్ మూవీస్ శోభన్ బాబు పెద్ద హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు.
tollywood super star krishna
ఆరోజుల్లో అందంగా ఉన్నవని చెప్పడానికి శోభన్ బాబు తో సరిపోల్చేవారు. మంచి మనసులు, సోగ్గాడు, మల్లెపూవు,కార్తీకదీపం,మహరాజు,బావామరదళ్ళు ,దేవత, వంటి చిత్రాలాలతో అగ్ర హీరోగా నిలబడ్డాడు. ఇక ఈ ముగ్గిరికన్నా చివరిలో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ లేటుగా వచ్చినా లేటెస్ట్ అంటూ ఎవరూ చేయని సాహసం చేసాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలిచాడు.
Super Star Krishna
తేనెమనసులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా,కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలతో కొట్టావొరవడి దిద్దాడు. తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్నాడు. మొదటి సినిమాకు మూడు వేలరూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఓ దశలో 25లక్షల వరకూ అందుకున్నారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు,అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
Tollywood hero Sobhan Babu Real Life Struggles
శోభన్ బాబు తో కల్సి మండెగుండెలు,ముందడుగు,మహాసంగ్రామం వంటి మల్టీస్టారర్ చేసాడు. ఎన్టీఆర్ తో దేవుడు చేసిన మనుషులు,వయ్యారి భామలు వగలమారి భర్తలు,అక్కినేనితో గురుశిష్యులు,ఊరంతా సంక్రాంతి వంటి చిత్రాలు చేసాడు. అయితే ఈ నలుగురిలో రెమ్యునరేషన్,సినిమాల సంఖ్యతో సంభందం లేకుండా చూస్తే ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకడు లేడు,రాడు అని చెప్పవచ్చు.