Healthhealth tips in telugu

ఈ సీజన్ లో మాత్రమే దొరికే వీటిని అసలు మిస్ చేసుకోవద్దు… ఊహించని ప్రయోజనాలు

palmyra sprout Health Benefits In telugu:ఈ కాలంలో చాలా విరివిగా లభించే తేగలను ఇష్టపడని వారుండరు. ఎలాంటి రసాయనాలూ, ఎరువులూ వాడకుండానే మొలకెత్తే తేగలరుచి అమోఘం. ఇందులో పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. తేగలు రోడ్డు మీద ఎక్కడ చూసిన విరివిగా లభిస్తున్నాయి. వీటిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది అసలు తేగల జోలికి అసలు రారు.

ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు తగ్గటానికి సహాయపడతాయి. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తేగలలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండెకు సమబందించిన సమస్యలను తగ్గిస్తుంది.

మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు తొలగిస్తుంది. నరాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. ప్రోటీన్ శరీరంలోని ప్రతి కణంలో ముఖ్యమైన భాగం. కణజాలాలను ఉత్పత్తి చేయడానికి మరియు మరమ్మతు చేయడానికి శరీరం ప్రోటీన్లను ఉపయోగిస్తుంది.
Diabetes diet in telugu
తేగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయబెటిస్ ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు. ఎందుకంటే డయబెటిస్ ఉన్నవారిలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సీజన్ లో దొరుకుతున్న తేగలను అసలు మిస్ చేసుకోవద్దు.
Weight Loss tips in telugu
తేగలలో విట‌మిన్ బి, విట‌మిన్ సి, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐర‌న్‌, ఫైబ‌ర్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు తేగలను తింటే తొందరగా ఆకలి వేయదు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.