Healthhealth tips in telugu

రోజూ ఉదయం కాఫీ, టీ లకు బదులు ఈ మజ్జిగ తాగితే… ఏమి అవుతుందో తెలుసా?

Butter milk health Benefits in Telugu: ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం అనేది మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం పట్ల శ్రద్ద ఎక్కువగా పెట్టవలసిన అవసరం ఉంది. ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మంది కాఫీ లేదా టీ త్రాగి దినచర్యను మొదలుపెడతారు.

ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాఫీ,టీ లకు బదులుగా ఇప్పుడు చెప్పే మజ్జిగ త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మజ్జిగలో ఏమి కలుపుకొని త్రాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
gas troble home remedies
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉండుట వలన కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణాశయం, పేగులు శుభ్రం అయ్యి వాటిలో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. అంతేకాక మంచి బాక్టీరియా పెరిగి అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.
curry leaves hair falla
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి త్రాగితే అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భోజనం చేసాక పొట్టలో అసౌకర్యంగా ఉంటే మజ్జిగలో అల్లం రసాన్ని కలిపి త్రాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ త్రాగి బయటకు వెళ్ళితే డీహైడ్రేషన్ బారిన పడరు. 
Ginger benefits in telugu
విరేచనాలు అవుతున్న వారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీస్పూన్ అల్లం రసం కలిపి త్రాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి.  హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా మజ్జిగను తాగటానికి ప్రయత్నం చేయండి. మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.