రాత్రి పడుకునే ముందు చిన్న కొబ్బరి ముక్క తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Dry Coconut Health benefits In telugu : ఎండు కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పచ్చి కొబ్బరితో పోలిస్తే ఎండు కొబ్బరి ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి చాలా రుచిగా ఉండటం వలన పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరిలో ఐరన్, పొటాషియం,calcium, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
కొబ్బరిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం కన్నా రాత్రి పడుకోవడానికి ముందు చిన్న కొబ్బరి ముక్క తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో కాస్త ఎక్కువగా ఆహారం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట సమస్యలు వచ్చేస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే రాత్రి పడుకోవడానికి అరగంట ముందు చిన్న కొబ్బరి ముక్క తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
అలాగే దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య కూడా ఉండదు. అలాగే మొటిమలు,నల్లని మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా రాత్రి సమయంలో చిన్న .కొబ్బరి ముక్క తినటం వలన మరుసటి రోజు నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి లేకుండా చురుకుగా ఉంటారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది.
అంతేకాకుండా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంవల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. calcium సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు.
ఈ సీజన్ లో వచ్చే సమస్యలు రావు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా బాగా పనిచేస్తుంది. ఎండు కొబ్బరిని లిమిట్ గా తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు అందుతాయి. ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. ఏదైనా అతిగా తింటే అనర్ధమే కదా… కాబట్టి ఎండు కొబ్బరిని చిన్న ముక్క తిని ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.