Varun Tej తొలిప్రేమ సినిమాను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Varun Tej Tholiprema Movie: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వం లో వచ్చిన సినిమా తొలిప్రేమ. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఫిదా సినిమా తరువాత వచ్చిన ఈ సినిమా వరుణ్ కి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మ్యుజికల్ గా కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.యూత్ కి నచ్చే అంశాలు ఎక్కువగా వుండడం ,ప్రేమికులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లను అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరొయిన్ గా నటించిన రాశిఖన్నా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
తన అందంతో ,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనే చెప్పాలి. ముఖ్యం గా కుర్రాల మతిని పోగొట్టేసింది రాశి.అప్పటివరకు చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమా ద్వార రాశి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో అసలు హీరోయిన్ గా మొదటిగా మెహ్రీన్ ను సంప్రదించాడు అట వెంకీ అట్లూరి.
కానీ ఆమె కాస్త బొద్దుగా కనపడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం. క్రిష్ణగాడి వీర ప్రేమకథ సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమయిన మెహ్రీన్ ఆ తరువాత రాజా ది గ్రేట్ ,జవాన్ ,మహానుభావుడు లాంటి సినిమాల్లో మెరిసింది.
కాగా తన అధిక బరువు వల్ల చాలా సినిమాలను మెహ్రీన్ చేజార్జుకుందని తెలుస్తుంది. తొలిప్రేమ హిట్ అవ్వడంతో తన పద్దతిని మార్చుకుని జిమ్ కి వెళ్లి వర్క్ఔట్స్ స్టార్ట్ చేసిన మెహ్రీన్ ఇప్పుడు బాగా సన్నంగా మారింది. మొత్తానికి తొలిప్రేమ సినిమా వల్ల మెహ్రీన్ కు జ్ఞానోదయం అయ్యిందని అనుకుంటున్నారు నెటిజన్లు.