MoviesTollywood news in telugu

Allu Arjun ‘ఆర్య’ సినిమాలో కనిపించిన హీరోయిన్ గుర్తుందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?

Arya movie heroine anuradha mehta : సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్ ల గురించి ఏ విషయం తెలిసిన చాలా ఆసక్తిగా గమనిస్తారు. ఆర్య సినిమా లో గీత గా నటించిన అనురాధ మెహతా గురించి మనందరికీ తెలుసు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పుట్టిన అను ‘ఆర్య’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన నువ్వంటే నాకిష్టం సినిమాల్లో నటించింది.

అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన ఆర్య సినిమా హిట్ అయినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
2007లో ‘మహారాజశ్రీ’ అనే సినిమాలో అందాలు ఆరబోసినా పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తమిళ, కన్నడ, మలయాళం వైపుకు వెళ్లి హీరోయిన్ గా ట్రై చేసింది.

అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. దాంతో సినిమా పరిశ్రమను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. అనురాధ మెహతా సినిమాకి సంబంధించిన ఎటువంటి వేడుకలకు హాజరు కాదు. ఆమె అంతలా సినిమాలకు దూరంగా ఉంది. అందం అభినయం, నటన ఉన్న ఈ తెలుగు అమ్మాయి కి అవకాశాలు రాకపోవడం ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.