ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది?
Parvati Melton: Tollywood లో ఎంతో మంది హీరోయిన్ లు ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పటికి నటనను కొనసాగిస్తున్నారు. మరి కొంత మంది సినిమాలకు బ్రేక్ ఇచ్చి జీవితంలో సెటిల్ అవుతున్నారు. టాలీవుడ్ ఎందరో హీరో హీరోయిన్లను అక్కున చేర్చుకుని పెద్ద పీట వేసింది. స్టార్ ఇమేజ్ తో పాటు స్టార్ డమ్ గా నిలదొక్కుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ చాలామందికి ఎర్ర తివాచి పరిచింది.
ఇక తెలుగులో రాజా హీరోగా వచ్చిన వెన్నెల సినిమాతో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ పార్వతి మెల్టన్. చాలామంది హీరోల సరసన నటించడమే కాదు ఐటెం సాంగ్స్ తో కుర్రకారుని వేడెక్కించింది. జల్సాలో పవన్ పక్కన, దూకుడులో మహేష్ బాబు పక్కన ఐటెం సాంగ్ చేసింది. ఇక ఆమె గురించి చాలామందికి తెలియదు. ఆమె పెళ్లి కూడా చేసుకుని అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఓ బాబుకి జన్మనిచ్చింది.
ఇక పార్వతి మెల్టన్ ఎవరనే విషయంలోకి వెళ్తే,ఈమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. న్యూజెర్సీలో జర్మనీ దేశానికి చెందిన శ్యాం మెల్టన్,ఇండియన్ పంజాబీ దార్ ప్రీత్ కి పుట్టిన పార్వతి మెల్టన్ కి ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు హరియాణా సితారా మెల్టన్. ఇక పార్వతి మెల్టన్ కి చిన్ననాటినుంచి డాన్స్ అంటే ఎంతోమక్కువ. కాలిఫోర్నియాలో డిగ్రీ చదివేటప్పుడు భరత నాట్యం నేర్చుకున్న పార్వతి మెల్టన్, వివిధ స్టేజి లపై ప్రదర్శలనలిచ్చి ఆకట్టుకుంది.\
అయితే ఆతర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఆమె 2004లో మిస్ టీమ్ ఇండియా, 2005లో యు ఎస్ ఏ మిస్ ఇండియా అమెరికాగా ఎంపికైంది. ఇంగ్లిష్ , హిందీ,తెలుగు, పంజాబీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లో మాట్లాడగల నేర్పు ఉంది.బహుభాషా కోవిదురాలైన పార్వతి మెల్టన్ ఏ భాషనైనా యిట్టె నేర్చుకోగలదు. ఈమె డిగ్రీ చదివేటప్పుడు టాలీవుడ్ లో వెన్నెల సినిమాలో అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చింది.
సినిమాల్లో హీరోయిన్ గా సక్సెస్ బాట పట్టడంతో స్టడీస్ కంప్లీట్ చేసి ఇండస్ట్రీకి వచ్చేసింది. మలయాళంలో కూడా పేరుతెచ్చుకున్న పార్వతి మెల్టన్, అక్కడ మోహన్ లాల్ తో తీసిన సినిమా హలొ గ్రాండ్ హిట్ కొట్టింది. తెలుగులో గేమ్, అల్లరి అల్లరి,మధుమాసం,జల్సా, దూకుడు,శ్రీమన్నారాయణ యమో యమ చిత్రాల్లో నటించిన ఈమె కు మెల్లిగా సినీ అవకాశాలు తగ్గడంతో అమెరికాలో యువ పారిశ్రామిక వేత్తను పెళ్ళాడి, న్యూజెర్సీలో సెటిల్ అయింది.