MoviesTollywood news in telugu

సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!!

Tollywood hero Heroines: మన అభిమాన నటుల సినిమాలను అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటాం. సినిమాల్లో నటించే హీరో,హీరోయిన్స్ మధ్య వయస్సు అంతరం ఉండటం సహజమే. కానీ ఆ అంతరం బాగా ఎక్కువ ఉంటె ఔరా అనిపించక మానదు. శ్రీదేవి ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించి ఆ తర్వాత ఎన్టీఆర్ తో హీరోయిన్ గా ఎన్నో సినిమాలను చేసింది.దీని బట్టి వారి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరం హీరోలు,హీరోయిన్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఒకసారి తెలుసుకుందాం .

వేటగాడు – వేటగాడు సినిమాలో నటించిన ఎన్టీఆర్ వయస్సు 56 సంవత్సరాలు,శ్రీదేవి వయస్సు 16 సంవత్సరాలు…ప్రేమాభిషేకం – ప్రేమాభిషేకం సినిమాలో నటించిన నాగేశ్వరరావు వయస్సు 58 సంవత్సరాలు,శ్రీదేవి వయస్సు 18 సంవత్సరాలు.

పవన్ కళ్యాణ్ ,ప్రణీత (అత్తారంటికి దారేది) – ఈ సినిమా అప్పటికి పవన్ వయసు 42,ప్రణీత వయసు 21 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 21 ఏళ్లు… రవితేజా,రాశిఖన్నా (బెంగాల్ టైగర్) – రవితేజ వయసు 47,రాశి వయసు 24 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 23 ఏండ్లు.

వెంకటేశ్,జెనీలియా (సుభాష్ చంద్రబోస్) – వెంకటేశ్ వయసు44, జెనీలియా వయసు 18 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 26 ఏండ్లు… నాగార్జున,అయేషాటాకియా(సూపర్) – నాగార్జున వయసు 46,అయేషా వయసు19 ఇద్దరి మధ్యా తేడా 27 ఏండ్లు.

బాలక్రిష్ణ,ఇషా చావ్లా (శ్రీమన్నారాయణ) – బాలక్రిష్ణ వయసు 52,ఇషా చావ్లా వయసు24 వీరిద్దరి మధ్యా 28 ఏండ్లు తేడా… చిరంజీవి,త్రిష (స్టాలిన్) – చిరంజీవి వయసు51,త్రిష 23 వయసు ఇద్దరి మధ్యా వయసులో వ్యత్యాసం 28ఏళ్లు.

కమల్ హాసన్,త్రిష(చీకటిరాజ్యం) – కమల్ వయసు 61,త్రిష వయసు32 ఇద్దరి మధ్యా తేడా 29ఏళ్లు… చిరంజీవి,కాజల్(ఖైదీ నెం150) – మెగాస్టార్ చిరంజీవి వయసు 61, కాజల్ వయసు31 ఇద్దరి మధ్యా వయసులో తేడా 30 ఏళ్లు… రజిని కాంత్,సోనాక్షి (లింగా) – సూపర్ స్టార్ రజిని వయసు63, బాలివుడ్ భామ సోనాక్షి సిన్హా 27 వయసు ఇద్దరి మధ్యా వయసులో తేడా 36ఏళ్లు.