Healthhealth tips in telugu

తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయ…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…న మ్మలేని నిజాలు

white onion and Red Onion Benefits :ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను కొంత మంది చాలా ఇష్టంగా తింటారు. మరి కొంత మంది ఉల్లి వాసన కారణంగా తినటానికి ఇష్టపడరు. ప్రతిరోజు మన వంటలలో ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. ఉల్లిపాయను దాదాపుగా ప్రతిరోజు వాడుతూనే ఉంటాం.

ఉల్లిపాయలలో తెల్ల ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు అనే రెండు రకాలు మనకు లభ్యం అవుతున్నాయి. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. ఎరుపు మరియు తెలుపు ఉల్లిపాయలు రెండింటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పచ్చి ఎర్ర ఉల్లిపాయలో 37 కేలరీలు ఉంటాయి, అదే తెల్ల ఉల్లిపాయలో 42 కేలరీలు ఉంటాయి.
White Onion Health Benefits In telugu
కాబట్టి తెల్ల ఉల్లిపాయల్లో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.100 గ్రాముల ఎరుపు ఉల్లిపాయలో ఫైబర్ 12 గ్రాములు ఉంటే, అదే తెల్ల ఉల్లిపాయలో 10 గ్రాములు ఉంటుంది. విటమిన్ సి రెండింటిలోను దాదాపుగా సమానంగానే ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. తెల్ల ఉల్లిపాయలలో కాల్షియం ఉండదు. ఎరుపు ఉల్లిపాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.
Eating raw onion with meals health benefits telugu
ఉల్లిపాయలు క్యాన్సర్‌తో పోరాడే గుణాలను కలిగి ఉన్నప్పటికీ, క్యాన్సర్‌తో పోరాడే లక్షణాల విషయానికి వస్తే ఎర్ర ఉల్లిపాయలు మరింత మెరుగ్గా ఉంటాయి.
ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు ఆంథోసైనిన్ మరియు క్వెర్సెటిన్ యొక్క అధిక స్థాయిల కారణంగా తెల్ల ఉల్లిపాయలతో పోలిస్తే ఎర్ర ఉల్లిపాయలు మానవ క్యాన్సర్ కణాలను చంపడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Onion benefits in telugu
ఆంథోసైనిన్ పండ్లు మరియు కూరగాయలకు రంగును అందజేస్తుంది. కాబట్టి ముదురు రంగులో ఉండే ఉల్లిపాయల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్నాయని అర్ధమవుతుంది. ఈ రెండు ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే. ఎర్ర ఉల్లిపాయలతో పోలిస్తే తెల్ల ఉల్లిపాయలో యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

తెల్ల ఉల్లిపాయలతో పోలిస్తే ఎర్ర ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. తెల్ల ఉల్లిపాయల కంటే చాలా ఎక్కువ. ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉన్నందున, ఎర్ర ఉల్లిపాయలు రక్తం పలుచగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక సారి తెల్ల ఉల్లిపాయ తింటే మరొక సారి ఎరుపు రంగులో ఉండే ఉల్లిపాయను తినండి. ఉల్లిపాయ సంవత్సరం పొడవునా లభిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.