MoviesTollywood news in telugu

Rao Ramesh సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలిస్తే షాక్ అవుతారు

Rao Ramesh Unknown Facts :రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రావు గోపాలరావు కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన రావు రమేష్ తన తండ్రి వారసత్వంతో కాకుండా తన స్వశక్తితో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సఫలం అయ్యాడు. కొత్త బంగారు లోకంలో చేసిన పాత్ర మంచి హిట్ కావటంతో అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది రావు రమేష్ కి.

రావు రమేష్ ఏ పాత్ర చేసిన తనకంటూ ఒక సొంత ఇమేజ్ తో సినిమా సినిమాకి మంచి పరిణితి కనపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి చేరాడు. రావు రమేష్ కి స్టైల్ ఫోటో గ్రాఫర్ అవ్వాలని కోరిక ఉండేది. నటన మీద మొదట్లో ఆసక్తి లేదు. ఫోటో గ్రాఫర్ గా కొంతమంది దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు.

అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం ఫోటో గ్రాఫర్ నుండి నటుడిగా టర్న్ అవ్వటానికి కారణం అయింది. ఆ పాత్ర క్లిక్ కావటంతో నటుడిగా సెటిల్ అయ్యిపోయాడు రావు రమేష్ . ప్రస్తుతం తండ్రి పాత్రలు, విలన్ పాత్రలు ఎక్కువగా రావటంతో వాటినే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రావు రమేష్. నటనలోకి ఇష్టం లేకుండా వచ్చిన సరే రావు రమేష్ తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.