MoviesTollywood news in telugu

స్టార్ హీరోయిన్ల హాబీస్ ఏంటో మీకు తెలుసా..? హీరోయిన్ అవ్వకపొతే…

Tollywood Star heroines :మన అభిమాన హీరో, హీరోయిన్ ల గురించి విషయాలు తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. మనలో చాలా మందికి చాలా హాబీలు ఉంటాయి. అలాగే మన అభిమాన హీరోయిన్స్ కూడా హాబీలు ఉంటాయి కదా. అవి ఏమిటో తెల్సుకుందాం. వారు షూటింగ్ అయిపోగానే ఏమి చేస్తారు. ఎలా గడుపుతారు. అలాగే మన అభిమాన తారలు నటి కాకుండా ఏమి అవ్వాలని అనుకున్నారో తెలుసుకుందాం. 
తమన్నా 
మిల్క్ బ్యూటీ తమన్నాకు డాన్స్ చేయటం అంటే ఇష్టం. ఏ మాత్రం కొంచెం ఖాళీ సమయం దొరికిన డాన్స్ ప్రాక్టీస్ చేసేస్తుంది. ట్రావెల్ చేయడం కూడా తమన్నాకి చాలా ఇష్టం..కాశ్మీర్ ని ఎక్కువగా ఇష్టపడే తమన్నా న్యూమరాలజీని చాలా ఎక్కువగా నమ్ముతుంది.
శ్రీయ 
‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ రజినీకాంత్,చిరంజీవి,బాలక్రిష్ణ,నాగార్జున లాంటి అందరు స్టార్ హీరోస్ తో జోడి కట్టింది. ఈ భామకు లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం మరియు మ్యూజిక్ వినటం చాలా ఇష్టమట. 
సమంత
సమంత స్టార్ హీరొయిన్ అవ్వటానికి చాలా కష్టాలనే పడింది. ఆమె సందర్భం వచ్చిన ప్రతి సారి చెప్పుతూ ఉంటుంది. ఆమె ఈ స్థాయికి వచ్చాక కూడా పాత స్నేహితులను మర్చిపోలేదు. పాత ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయటం,లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం వంటివి చేస్తుంది. 
Tollywood Heroine Shruti Haasan
శృతిహాసన్
తన బిజీ షెడ్యూల్ నుండి కొంచెం లీజర్ దొరగ్గానే పుస్తకాలు చదువుతుంది శృతిహాసన్..దాంతో పాటు సెల్ఫీలు దిగడం శృతి అలవాటు.దాంతో పాటు ఫ్రెండ్స్ తో ఛాట్ చేయడంతో పాటు లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి ఇష్టపడుతుంది.
ఆసిన్
తమిళ్,తెలుగు,మళయాలిలలో తన సత్తా చాటి బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆమె వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. ఆమెకు పార్టీలు, ఒక్కతే లాంగ్ డ్రైవ్ కి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం,మ్యూజిక్ వినడం అలవాటు. 
హన్సిక
ఇది మట్టండీ మట్టీ అంటూ అమాయకంగా మాట్లాడిన పాల బుగ్గల హన్సిక .. షూటింగ్స్ అయిపోగానే డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడం,అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తినడం హన్సిక అలవాట్లు.

త్రిష
త్రిష కృష్ణన్ ఖాళీ సమయాల్లో పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది.అంతే కాదు ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడే త్రిష..పార్టీలకు దూరంగా ఉంటుంది..మ్యూజిక్ వినడం కూడా త్రిష అభిరుచుల్లో ఒకటి.