Nani భార్య అంజనా గురించి నమ్మలేని నిజాలు.. ఎవరి కూతురో తెలుసా..?
Tollywood hero Nani Wife: టాలీవుడ్ లో హీరోల గురించి ఏ వార్త వచ్చిన అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. నేచురల్ స్టార్ నాని తన ప్రస్థానాన్ని రేడియో జాకీగా ప్రారంభించి సినీ పరిచయాలు పెంచుకొని హీరో కావాలని కలలు కన్నాడు. అయితే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు క్లాప్ కొట్టిన నాని స్వయంకృషితో తిరుగులేని హీరోగా మారాడు.
చిన్న బడ్జెట్ నిర్మాతలకు గ్యారెంటీ హీరోగా మారాడు నాని. నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. నానిని పక్కా ఫ్యామిలీ మెన్ అని అంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్ అయ్యిపోగానే ఇంటికి చేరిపోతాడు. ఇక నాని 2012 లో అంజనాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయ్యాక నానిలో చాలా మార్పులు వచ్చాయని నాని స్నేహితులు,సన్నిహితులు చెప్పుతూ ఉంటారు.
అసలు నాని జీవితంలోకి అంజనా ఎలా ప్రవేశించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంజనాది వైజాగ్. అంజనా విద్యాబ్యాసం పోర్ట్ సిటీలో జరిగింది. గీతం యూనివర్సిటీ నుండి BE పట్టా అందుకుంది. ఆ తర్వాత మణిపాల్ యూనివర్సిటీ నుండి కార్పొరేట్ కమ్యూనిటీలో PG చేసింది.
అంతేకాకుండా అంజనా తన అభిరుచి మేరకు బెంగుళూర్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఇక నాని పరిచయం అంజనా కజిన్ ద్వారా జరిగింది. నాని రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలో అంజనా కజిన్ కూడా రేడియో జాకీగా పనిచేయటం వలన నాని అంజనాకు ఆలా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత నాని,అంజనా ఇద్దరు 5 సంవత్సరాల పాటు పేస్ బుక్ చాటింగ్ ప్రేమలో మునిగిపోయారు. వీరి ప్రేమకు పెద్దవారు అడ్డు చెప్పలేదు. అంజనా ఫ్యామిలీ వైజాగ్ లో చాలా రిచ్ ఫ్యామిలీ అని సమాచారం. అంజనా తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట.
నాని తన పెళ్లిని చాలా సింపుల్ గా 35 లక్షలతో చేసుకున్నాడు. నానికి పెళ్లి సందర్భంగా నాని మామగారు ఖరీదైన బంగాళా, విదేశీ కారు ఇచ్చినట్టు సమాచారం. నాని హీరో కాకా ముందు నుంచి తెలుసు కాబట్టి అంజనా ఫ్యామిలీ వారికీ తగ్గట్టుగానే లాంఛనాలు నానికి ఇచ్చారు.
అంజనా ప్రస్తుతం సినీ రంగంలోనే పనిచేస్తుంది. ఆమె ఆర్కా మీడియా క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంది.బాహుబలి సినిమాలో ప్రభాస్,అనుష్క,రానా తదితరుల కాస్ట్యూమ్స్ ని రమా రాజమౌళి తో కలిసి రూపొందించింది. నాని అంజనాను ముద్దుగా అంజు అని పిలుస్తాడట. వీరిద్దరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే నాని కూడా సోషల్ మీడియాలో రేర్ గా కనపడతాడు.