Chiranjeevi ఠాగూర్ సినిమా వెనుక ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు
Chiranjeevi Tagore Movie : చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు పండగ చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరువలేని రోజు 2003 సెప్టెంబర్ 24. కారణం ఆరోజు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఠాగూర్ విడుదల. లంచాల వలన మనదేశం ఎంతలా దెబ్బతింటోందో కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
జనాలు సినిమా చూసి చిరంజీవిని అభినందించారు. ఫాన్స్ అయితే కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే నీ నుంచి ఇలాంటి మూవీస్ రావాలి అన్నయ్య అంటూ హత్తుకున్నాడు. అవినీతికి పాల్పడే అధికారులను కిడ్నాప్ చేసి చంపేయడం,దాంతో అవినీతి అధికారుల్లో గుబులు వంటి సీన్స్ తో పాటు హాస్పిటల్ దోపిడీ సీన్స్ జనంచేత చప్పట్లు కొట్టించాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్,నేనుసైతం సాంగ్ వంటివి ఉద్వేగానికి లోనుచేస్తాయి.
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. ఎక్కడ చూసినా ఠాగూర్ ప్రస్తావన రావడంతో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడా అనే కలవరం రాజకీయ పార్టీల్లో మొదలైంది. స్టార్ నుంచి లీడర్ స్థాయికి చిరంజీవి ఎదిగాడు. ఇమేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇక వినాయక్ కి నెంబర్ వన్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. అయితే ఈ సినిమా తెరకెక్కడానికి ఎంత కృషి జరిగిందో పరిశీలిస్తే,ఇంద్ర తర్వాత ఏ సినిమా అని అనుకుంటుంటే ఏదైనా సందేశాత్మక మూవీ చేయాలన్న ఆలోచన వచ్చింది.
అయితే తమిళంలో విజయకాంత్ హీరోగా రమణ మూవీ తెరకెక్కుతోంది. మధు అనే వ్యక్తి ఈ సినిమా తెలుగులో చిరుకి సరిపోతుందని చెప్పాడు.ఈ లోగా సినిమా కూడా రిలీజ్ అయి,బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అరవింద్ ని చిరు రంగంలో దింపాడు. మరోపక్క డాక్టర్ రాజశేఖర్ ట్రై చేసాడు. అయితే అరవింద్,మధు కలిపి చేసిన రాయభారంతో హక్కులు వచ్చేసాయి.
పరుచూరి బ్రదర్స్ కి మన నేటివిటీకి తగ్గట్టు చేర్పులు మార్పులు చేయమనడంతో రెండు వారాల్లో రెడీ అయింది. మురుగుదాస్ ని డైరెక్టర్ గా చేస్తే నేటివిటీ ఉండదని భావించి,చివరకు వినాయక్ ని కన్ఫర్మ్ చేయడంతో అతడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. శ్రేయను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. రెండో హీరోయిన్ గా సౌందర్య అనుకుంటే ఖాళీలేకపోవడంతో మాధురి దీక్షిత్ ని సంప్రదిస్తే ఆమె ప్రెగ్నెంట్. దీంతో జ్యోతికను ఫిక్స్ చేసారు.
ఇలా చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు ఎన్నో మార్పులు చేసి,సినిమా వదిలారు. టోటల్ గా 26కోట్ల షేర్ కలెక్ట్ చేసి,ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. 253కేంద్రాల్లో వందరోజులు ఆడింది. చిరు కెరీర్ లో టాప్ ఫైవ్ లో ఈ సినిమా ఒకటి.