ఈ అంబలి తాగితే డయాబెటిస్, అధిక బరువు, అలసట,నీరసం అనేవి అసలు ఉండవు
Jonna ambali Benefits In telugu: ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. అలాంటి ఆహారాలలో జొన్నలు ఒకటి. జొన్నలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకొని తింటారు. అలాగే పిండితో రొట్టెలు,అంబలి వంటివి తయారుచేసుకొని తీసుకోవచ్చు. ఈ రోజు జొన్నలతో అంబలి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. జొన్నలను మెత్తని పిండిగా తయారుచేసుకోవాలి.
ఒక గిన్నెలో రెండు స్పూన్ల జొన్న పిండి వేసి దానిలో గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు లేదా సైందవ లవణం వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి మీద నుంచి దించి కొంచెం చల్లారాక గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం, రెండు చిటికెల మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
ఈ విధంగా తయారుచేసిన జొన్న అంబలిని ప్రతి రోజు తీసుకోవచ్చు. లేదా వారంలో మూడు సార్లు తీసుకోవచ్చు. ఈ జొన్న అంబలిని తాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే అలసట,నీరసం లేకుండా శక్తి ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
డయాబెటిస్, రక్తపోటు సమస్యలు ఉన్నవారికి కూడా ఈ అంబలి చాలా సహాయపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారిలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. ప్రోటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి రాకుండా చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జొన్న అంబలి తీసుకొని ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.