Chiranjeevi కెరీర్ను మార్చేసిన టాప్ సినిమాలు ఏమిటో తెలుసా ?
Megastar Chiranjeevi Best Movies : చిరంజీవి సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. సినిమా హీరోనే కాకుండా రాజకీయవేత్తగా కూడా సత్తా చాటారు.
చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు వెనక ఆయన చేసిన ఎన్నో సినిమాల కృషి ఉంది. చిరంజీవి కెరీర్ను మార్చిన టాప్ సినిమాలు గురించి తెలుసుకుందాం.
చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చిరుకి మంచి గుర్తింపును అందించింది. 1982 లోనే విడుదలైన మరో సినిమా కె విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అభిలాష సినిమా వచ్చింది. ఈ సినిమా తోనే చిరంజీవి సుప్రీం హీరో అయ్యాడు.
1983లో విజయ బాపినీడి దర్శకత్వంలో వచ్చిన మగమహారాజు సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ ని మార్చి నెంబర్ వన్ స్థానం వైపు తొలిసారిగా అడుగులు వేయటానికి సహాయపడింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే వచ్చిన మరొక సినిమా దొంగ మొగుడు మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా నటుడుగా గొప్ప పేరు తెచ్చింది. ఈ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది.
బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రవీణ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. రవి రాజా పినిశెట్టి తెరకెక్కించిన యముడికి మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాను చిరంజీవి స్నేహితులైన సుధాకర్., హరిప్రసాద్ కలిసి నిర్మించారు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చిరంజీవి మార్కెట్ ని రెండింతలు పెంచింది. విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా రికార్డులను సృష్టించింది.
రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన రౌడీ అల్లుడు సినిమా మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా 10 కోట్ల మార్కును దాటింది. కొంత గ్యాప్ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నటించిన హిట్లర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
అలాగే కొంత గ్యాప్ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో మొదటిసారిగా చిరంజీవి ఫ్యాక్షనిస్ట్ పాత్రలో నటించాడు. లంచం నేపథ్యంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమా మరొకసారి రికార్డులను సృష్టించింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చిరంజీవి లో కామెడీ టైమింగ్ ఏంటి అనేది చూపించింది. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనాన్ని సృష్టించింది.